శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం నాడు ట్రాఫిక్ ను సరళీకరించినందుకు జగిత్యాల డీఎస్పీ దురుశేటి రఘు చందర్ చారిని శనివారం ఆయన ఛాంబర్ లో పట్టణ విశ్వకర్మలు కృతజ్ఞత అభినందన సత్కారం చేశారు. విశ్వకర్మ ముద్దు బిడ్డ డీఎస్పీ గా జగిత్యాలకు రావడం ఆనందంగా ఉందని విశ్వకర్మలు అభిప్రాయపడ్డారు. సంఘం జిల్లా నేతలు సంకోజు వెంకట రమణ, విశ్వబ్రాహ్మణ సంఘం పెద్దలు, తదితరులు పాల్గొన్నారు .