ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. రానున్న 48 గంటల్లో ఒడిసా, బెంగాల్ తీరాలను ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం చోటు చేసుకునే ప్రమాదం ఉందన్నారు ఎండీ ప్రఖర్ జైన్. దాని ప్రభావంతో రేపటి నుంచి వారం పాటు కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.