బాలికల కోసం క్రికెట్ అకాడమీలు రావాలి
NEWS Aug 25,2025 09:28 am
బాలికల కోసం మరిన్ని క్రికెట్ శిక్షణ సంస్థలు రావాల్సిన అవసరం ఉందన్నారు స్టార్ క్రికెటర్ స్మృతీ మంధన్నా. సుచిత్ర అకాడమీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బాలికల క్రికెట్ అకాడమీని ప్రారంభించారు. యువ మహిళా క్రికెటర్లు తమ నైపుణ్యాలను మెరుగు పరుచు కోవడానికి ఒక బలమైన వేదికను అందించడం ఈ చొరవ లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీతో కలిసి పికిల్‌బాల్ కోర్టును కూడా ప్రారంభించారు.