కార్మికుల సమస్యల పరిష్కారానికి "చలో హైదరాబాద్"
NEWS Aug 25,2025 07:12 pm
మణుగూరు: సింగరేణి కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికుల సదస్సు సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సదస్సును జయప్రదం చేయాలని ఐఎఫ్టియు నాయకుడు నాసర్ పాషా పిలుపునిచ్చారు. మణుగూరులో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, స్కీమ్ వర్కర్ల సమస్యల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయని విమర్శించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.