భారత్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దు కుదరదు
NEWS Sep 11,2025 12:37 pm
సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు కోరగా స్పందించింది కోర్టు. అది కేవలం ఒక మ్యాచ్ మాత్రమేనని, జరగనీయాలని పేర్కొంది. రద్దు చేయాల్సిన అవసరమేంటని పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదిని ప్రశ్నించారు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ తో కూడిన ధర్మాసనం.