అల్పపీడనం కారణంగా పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి హైదరాబాద్ లో. భారీ వర్షాల కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు గల్లంతయ్యారు. చాలా చోట్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్ స్తంభించి పోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. వర్షాల తాకిడికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరం అంతటా జన జీవనం స్తంభించి పోయింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.