కేటీఆర్ నువ్వో బచ్చాగాడివి
NEWS Sep 18,2025 03:00 pm
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ ను ఏకి పారేశారు. నువ్వెంత నీ బతుకెంత..ఓ బచ్చాగాడివంటూ మండిపడ్డారు. మీ నాయిన కేసీఆర్ పాలేరుకు వచ్చి మూడుసార్లు ముక్కు నేలకు రాసినా ఏం చేయలేక పోయాడన్నారు. మీ అహంకారానికి ప్రజలు రెండు సార్లు బుద్ధి చెప్పినా సోయి రాలేదన్నారు. ఇప్పుడు మూడో సారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వార్నింగ్ ఇచ్చారు. ఈ మూడేళ్ల తర్వాత అసలు నువ్వు ఇండియాలో ఉంటావా లేకపోతే లగేజ్ సర్దుకుని అమెరికా వెళ్లిపోతావా అని ప్రశ్నించారు.