ఈ టెక్నాలజీతో వాహనాలు ఢీ కొనవు
NEWS Jan 30,2026 10:44 pm
రోడ్డు ప్రమాదాలను తగ్గించే అధునాతన సాంకేతికత. వాహనాల్లో అమర్చే V2V (వాహికల్ టు వాహికల్) చిప్ ద్వారా ఎదురు ఎదురుగా వచ్చే వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనకుండా ముందుగానే డ్రైవర్లను అప్రమత్తం చేస్తాయి. దీంతో ప్రమాదాల అవకాశాలు భారీగా తగ్గుతాయి. 2026 చివరి నాటికి కొత్త వాహనాల్లో కంపెనీల నుంచే V2V చిప్ అమర్చి అందించే అవకాశం ఉంది. చిప్ ధర రూ.5 వేల నుంచి రూ.7 వేల మధ్య ఉండనుంది. రెనాల్ట్ ఇండియా తమ మూడో తరం డస్టర్‌లో ఈ టెక్నాలజీ ఫస్ట్ లుక్‌ను ప్రదర్శించింది.