ఆమ్ ఆద్మీ ఎంపీ రాఘవ్ చద్దా చేసిన తాజా ఇన్‌స్టా పోస్టు కొత్త రాజకీయ పార్టీపై ఊహాగానాలకు దారితీసింది. యువతతో కలిసి “జెన్ జెడ్ పార్టీ” స్థాపించాలని సూచించిన వీడియోను ఆయన “ఆసక్తికరమైన ఆలోచన” అంటూ రీపోస్ట్ చేయడంతో చర్చలు జోరందుకున్నాయి. మరోవైపు Bhagwant Mann వ్యాఖ్యలు, అంతర్గత విభేదాలు పరిస్థితిని మరింత వేడెక్కించాయి. కొత్త పార్టీ పెడతారా లేదా బీజేపీలో చేరతారా అన్నది ఆసక్తికరంగా మారింది.