'మంగ్లీ వివాదంతో సంబంధం లేదు'
NEWS Apr 11,2026 11:33 pm
HYD: సింగర్ మంగ్లీ వివాదంలో తనపై వస్తున్న ఆరోపణలను దర్శకుడు వేణు ఉడుగుల ఖండించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. FIRలో తన పేరు లేదని, ఫిర్యాదుదారుడైన అడ్వకేట్ సుబ్బారావు, పంజాగుట్ట పోలీసులు సైతం తనను క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు ప్రచారం చేసి తన పరువుకు భంగం కలిగించవద్దని మీడియాను కోరారు.