తెలంగాణ ఇంటర్ ఫలితాల వేళ రాష్ట్రంలో తీవ్ర విషాదం. పరీక్షల్లో పాసవ్వలేదనే కారణంతో పలు జిల్లాల్లో 8 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. మార్కులే జీవితం కాదనే విషయాన్ని పిల్లలకు పేరెంట్స్, టీచర్స్ అర్థమయ్యేలా వివరించాల్సిన అవసరం ఉంది. మన విద్యా విధానం మారితేనే ఈ సమస్యకు పరిష్కారం.