పట్నా: బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ రాజీనామా చేయడంతో కొత్త సీఎంగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి పేరును ఎన్డీఏ ప్రకటించింది. త్వరలో గవర్నర్‌ను కలిసి తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు విజ్ఞప్తి చేయనున్నారు. ఏప్రిల్ 15న సీఎంగా సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. నితీష్ కుమార్ ఇటీవల రాజ్యసభ ఎంపీ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.