మండే రోజు తెలంగాణ రాజకీయాలు మరింతా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా నస్తూర్‌పల్లి సభలో పాల్గొని కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా BRSపై తీవ్ర విమర్శలు చేసే అవకాశముంది. మరోవైపు ఏడాది తర్వాత కేసీఆర్ జగిత్యాల సభలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడే అవకాశం ఉంది. ఇద్దరు నేతల ప్రసంగాలతో రాష్ట్ర రాజకీయాలు హాట్‌గా మారనున్నాయి.