2వ రోజుకు వీహెచ్ నిరవధిక దీక్ష
NEWS May 10,2026 02:16 pm
జనగణనలో ఓబీసీల కులగణనను చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు చేపట్టిన నిరవధిక దీక్ష రెండో రోజుకు చేరింది. హైదరాబాద్ అంబర్‌పేటలోని ఆయన నివాసం వద్ద దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్ష శిబిరాన్ని పెద్ద ఎత్తున ద్వితీయ శ్రేణి నాయకులు తరలివచ్చి వీహెచ్‌కు సంఘీభావం ప్రకటించారు. ప్రధాని మోదీ బహిరంగ సభ నేపథ్యంలో పలుచోట్ల కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.