తిరుమల: త్వరలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించనున్నట్టు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా పక్షంగా ప్రజల కోసం, ప్రజల గొంతుక వినిపించేందుకు కొత్త పార్టీ స్థాపిస్తానని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం లేకుండా దేశం సుభిక్షింగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఈ నెలలోనే తదుపరి రాజకీయ ప్రణాళికను చెబుతానని వెల్లడించారు.