Logo
Download our app
తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యంపై నివేదిక
NEWS   Aug 20,2026 02:25 pm
కాకినాడ జిల్లా తుని చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు. జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 70 రోజులు గడిచాయి. ఇన్ని రోజులైనా చిన్నారి ఆచూకీ మాత్రం లభించలేదు.చిన్నారి ఆచూకీని కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారంటూ హైకోర్టులో న్యాయవాది జి.శ్రీకాంత్ ఇటీవల పిటిషన్ వేశారు. పోలీసుల తరఫున న్యాయవాది జయంతి వాదనలు వినిపించారు. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ధర్మాసనానికి తెలిపారు. జ్ఞానేశ్వరి అదృశ్యంతో బాధిత కుటుంబం తీవ్రంగా కుంగిపోయింది. పోలీసులు డ్రోన్లు, జాగిలాలతో పరిసర ప్రాంతాల్లో గాలించినా స్పష్టమైన క్లూ దొరకలేదు. ఎవరైనా అపహరించి ఉంటే, ఆమెను తమకు అప్పగించాలని పోలీసులు సైతం స్పష్టం చేశారు. వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయమని తెలిపినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ కేసులో పోలీసులకు ఎలాంటి పురోగతి లేదు. దర్యాప్తులో భాగంగా 15వేల ఫోన్ కాల్‌లను విశ్లేషించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source