కొండా సురేఖను పార్టీలో నుండి బహిష్కరించక ముందే ఆమెనే వెళ్ళిపోతే మంచిదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయిని మాట్లాడుతూ.. నలుగురిని గెలిపించామని గొప్పలు చెప్పుకోవడం తప్ప వారు చేసింది ఏమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలోనే కొన్ని గుంట నక్కలు కొండా సురేఖ వెనకాల ఉన్నాయని అమ్మ సురేఖ.. రేవంత్ రెడ్డి రక్తం తాగింది చాలని పార్టీ నుంచి వెళ్లిపోవాలన్నారు.