వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారుసెంట్రల్ జోన్ డిసిపి కవిత కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.12 లక్షల విలువైన 70 గ్రాముల బంగారు ఆభరణాలు,527.9 గ్రాముల వెండి,రూ.29,875 నగదు రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.నిందితుడు ఆశిష్ శ్రీనివాస్ రెడ్డిమల్ల పెద్దపల్లి జిల్లాకు చెందిన వ్యక్తిగా ప్రస్తుతం మహారాష్ట్ర చంద్రపూర్ లో నివసిస్తున్నట్లు చెప్పారు.సులభంగా డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో చోరీలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.