మానవ మనుగడకు మొక్కలు చాలా అవసరమని తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని రంగసాయపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆట విశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.