రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలలకు రూ. 15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. స్థానిక కళాశాలలు, పేద విద్యార్థుల భవిష్యత్తును విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం విదేశీ విశ్వవిద్యాలయాల జపం చేయడం హాస్యాస్పదమన్నారు. బకాయిల సాధనకు బీజేపీ చేపడుతున్న పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు.