కరీంనగర్: దేశంలో సామాన్య ప్రజలకు సైతం డిజిటల్ సేవలను చేరువ చేయడంలో యూపీఐ విప్లవాత్మక మార్పులు తెచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యూపీఐ సేవలు పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్‌లోని చైతన్యపురిలోని టీ షాపులో ఆయన టీ తాగి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డిజిటల్ పద్ధతిలో బిల్లు చెల్లించారు.