నందవరం మండలం పులచింత గ్రామానికి చెందిన కర్నూలు జిల్లా రైతు సంఘం నాయకుడు పంపన్న గౌడ్ బైక్ ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్నారు. ఆయన ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి డా. మాచాని సోమనాథ్ రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. గతంలో పంపన్న గౌడ్‌ను పరామర్శించిన డా. సోమనాథ్ వైద్యపరమైన సూచనలు కూడా చేశారు. ఆయన తరఫున అనుచరులు పులచింతలో సహాయం అందించారు.