వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ తాళ్లపల్లి మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు.టీజీ ఐసెట్ లో అర్హత సాధించిన వారితోపాటు అర్హత పొందని వారు కూడా స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావాలని తెలిపారు.ఈనెల 31 నుంచి వచ్చే నెల 3 వరకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయని అభ్యర్థులు ఓర్జినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.