కరీంనగర్: 'జాంబీ రెడ్డి 2' సినిమాలో తన 'పున్నమ్మ పున్నమ్మ' పాటను అనుమతి లేకుండా వాడారని తెలంగాణ ఉద్యమ గాయకురాలు తేలు విజయ కరీంనగర్ 1-టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హక్కులకు భంగం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, పాటను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రక్షణ సేన నాయకులు ఆమెకు మద్దతు తెలిపారు.