గోనెగండ్ల: ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా నూతన కన్వీనర్‌గా ఎన్నికైన గంజహళ్లి మహదేవ్ మాదిగను గోనెగండ్ల మండల ఎమ్మార్పీఎస్ శ్రేణులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహదేవ్ మాదిగ మాట్లాడుతూ, 25 ఏళ్ల తన పోరాటాన్ని గుర్తించి బాధ్యత అప్పగించిన బ్రహ్మయ్య మాదిగకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పర్యటించి ఎమ్మార్పీఎస్ బలోపేతానికి, మాదిగల ఐక్యతకు కృషి చేస్తానన్నారు. దళిత హక్కుల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.