మిషనరీ చర్చి భూములను పరిరక్షించాలని కోరుతూ హనుమకొండలో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. కొందరు దౌర్జన్యంగా మిషనరీ చర్చి భూములను ఆక్రమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చి భూముల్లో కొందరు అక్రమ కట్టడాలకు యత్నిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్చిల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే ఊరుకోబోమన్నారు.