ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం బుల్లోనిపల్లి గ్రామంలో మంత్రి పొన్నం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో ప్రజల సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన పలు వినతులను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.