జిల్లా కారాగారాన్ని పరిశీలించిన సివిల్ జడ్జి
NEWS Aug 31,2026 07:34 pm
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా కారాగారాన్ని సీనియర్ సివిల్ జడ్జి వై. యశ్వంత్ సింగ్ సందర్శించి సేవలను తనిఖీ చేశారు. ఖైదీలతో మాట్లాడుతూ గంజాయి అమ్మకం, వినియోగం తీవ్ర నేరాలని హెచ్చరించారు. జైలును పరివర్తనా కేంద్రంగా భావించి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఉచిత న్యాయ సహాయం కోసం లీగల్ ఎయిడ్ న్యాయవాదులను సంప్రదించాలని, సంస్థ ఫోన్ నంబర్‌ను ప్రదర్శించాలని ఆదేశించారు.