వరంగల్ నగరంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 1500 మంది నిరుపేద,మధ్యతరగతి ప్రజలకు కంటి పరీక్షలు చేశారు.పేద ప్రజలకు మెరుగైన కంటి వైద్యం అందించడమే తమ లక్ష్యం అని భవిష్యత్తులో మరిన్ని ఉచిత వైద్య సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని ట్రస్ట్ చైర్మన్ ప్రదీప్ రావు పేర్కొన్నారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రజలు ఎప్పటికప్పుడు తమ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.