తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని BRS నేతలు పేర్కొన్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండల కేంద్రంలో BRS పాలనలో తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా సెప్టెంబర్ 17న మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం అనేక విధాలుగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో BRS నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.