కల్కి భగవాన్ కన్నుమూత
NEWS Sep 30,2026 10:43 am
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. LIC క్లర్క్ నుంచి ఆధ్యాత్మిక గురువుగా అంచెలంచెలుగా ఎదిగిన కల్కి.. వన్నెస్ ఉద్యమాన్ని, ఏకం క్యాంపస్‌ను స్థాపించారు. భక్తుల సందర్శానార్థం ఆయన పార్థివ దేహాన్ని ఇవాళ తిరుపతి జిల్లాలోని వరదయ్యపాలెంలో ఆధ్యాత్మిక కేంద్రం ఏకం క్షేత్రంలో ఉంచారు.