అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట తైపురం గ్రామంలో నిర్వహించిన ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పల్లా చిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.