NHMల సమస్యలు పరిష్కరించాలి
NEWS Oct 09,2026 08:32 pm
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ను కలిశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఈ నెల 13 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు.ఉద్యోగుల సమ్మెకు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు.