CJP ధర్నా: ఢిల్లీలో భారీ భద్రత
NEWS Oct 09,2026 08:14 pm
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో అక్టోబర్ 10 నుంచి ధర్నాకు పిలుపునిచ్చింది. పోలీసులు అనుమతి నిరాకరించడంతో రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సెంట్రల్ ఢిల్లీలో BNSS సెక్షన్ 163 అమలు చేస్తూ నిరసనలపై ఆంక్షలు విధించారు. సున్నిత ప్రాంతాల్లో నిఘా పెంచి, భారీగా భద్రతా బలగాలను మోహరించారు. మరోవైపు, శాంతియుత నిరసనలకు జంతర్ మంతర్ కాకుండా మరోచోట అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు సమాచారం.