ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
NEWS Oct 09,2026 08:31 pm
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జీవోలను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో బీసీ రిజర్వేషన్ల అంశంలో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.