జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
NEWS Oct 10,2026 02:34 pm
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు పి. హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో, ఓటర్ల జాబితా సవరణ పేరుతో దేశవ్యాప్తంగా 13.70 కోట్ల ఓట్లు తొలగించారంటూ ఆయన ఆరోపించారు. భారత పౌరుల ఓటు హక్కును ప్రభావితం చేసే చర్యలకు బాధ్యులైన వారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పౌరులు ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారని హరినాథ్ రెడ్డి పేర్కొన్నారు.