సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ నేతృత్వంలో నిరసనకారులు ఆందోళనలను చేపట్టారు. అయితే వీరిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో నిరసనకారులు బారికేడ్లు, గేట్లను దూకుతూ నిరసన ప్రదేశానికి వెళ్తున్నట్టు కనిపిస్తోంది. అయితే అక్కడ మోహరించి ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.