రిజర్వేషన్ ప్రకటనతో వెంటనే పెళ్లి!
NEWS Oct 14,2026 10:05 am
మున్సిపల్ ఛైర్పర్సన్ పదవిపై ఆశలు పెట్టుకున్న ఓ యువ నేత రిజర్వేషన్ ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన TDP మాజీ కౌన్సిలర్ వైకుంఠపు హర్షవర్ధన్ ఛైర్మన్ పదవిని ఆశించారు. అయితే, ఆ స్థానం బీసీ మహిళకు కేటాయించడంతో తనకు బదులుగా భార్యను బరిలోకి దించాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులను ఒప్పించి, ప్రేమించిన మంజీరను మంగళవారం స్థానిక ఆలయంలో వివాహం చేసుకున్నారు. రానున్న ఎన్నికల్లో భార్యకు పార్టీ టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.