తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడండి
ఎస్పీ రాజేష్ చంద్రకు డా. బాలు వినతి
NEWS Oct 15,2026 10:35 am
కామారెడ్డి: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడాలని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్క్రాస్ జిల్లా సమన్వయ సభ్యుడు డా. బాలు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రను కోరారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించే రక్తదాన శిబిరాల్లో తలసేమియా చిన్నారులకు అవసరమైన రక్తాన్ని సేకరించి అందించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడు చిలువేరి మారుతి పాల్గొన్నారు.