మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
NEWS Oct 15,2026 08:35 pm
జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ విజయ సునీత తెలిపారు. 3 మున్సిపాలిటీల పరిధిలో 100 వార్డులు, 163 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ, 19న పరిశీలన, 21న ఉపసంహరణ, 28న పోలింగ్తో పాటు ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా పోలీసు బందోబస్తు, వెబ్కాస్టింగ్, సీసీ కెమెరాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.