ఉత్తమ వ్యవసాయ అధికారిగా యోగిత
NEWS Oct 15,2026 08:36 pm
జగిత్యాల: కిసాన్ మేళా సందర్భంగా కదలాపూర్ మండల వ్యవసాయ అధికారి యోగిత జిల్లా ఉత్తమ వ్యవసాయ అధికారిగా అవార్డు అందుకున్నారు. మంత్రి లక్ష్మణ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, సీడ్స్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆమెకు ప్రశంసాపత్రం అందించి సన్మానించారు. ఈ సందర్భంగా యోగిత మాట్లాడుతూ, ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రకృతి వ్యవసాయ ఉద్యమానికి అంకితభావంతో కృషి చేస్తున్న గ్రామీణ మహిళలు, రైతులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. జీవవైవిధ్య పరిరక్షణతో పాటు రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించే దిశగా రైతులు వినూత్న పద్ధతులను అనుసరించాలని ఆమె కోరారు.