రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ మూవీ తెలుగు ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడిగా యశ్ నటిస్తున్నాడు. అదిరిపోయే గ్రాఫిక్స్, గ్రాండియర్ లుక్స్తో నిండిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇందులోని పోరాట ఘట్టాలు ఆసక్తికరంగా ఉన్నాయి. దీపావళి కానుకగా నవంబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది.