PRTU TS రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా
జగిత్యాల జిల్లాకు చెందిన నలుగురు
NEWS Oct 16,2026 03:44 pm
పీఆర్టీయూ టీఎస్ ఆరో రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో జిల్లాకు చెందిన నలుగురు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా, మరో ఆరుగురు రాష్ట్ర కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, సంఘ బలోపేతానికి అంకితభావంతో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయినిపెల్లి ఆనందరావు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు రాపర్తి నర్సయ్య, రాయికల్ మండల అధ్యక్షుడు అంతడుపుల గంగారాజం తదితరులు పాల్గొన్నారు.