www.breakingnow.app | Fri, 20 Nov 2026
LATEST NEWS Telangana, Hyderabad

హైదరాబాద్‌లో ప్రమాదకర వాయు కాలుష్యం

Share:
128 Views
హైదరాబాద్‌లో ప్రమాదకర వాయు కాలుష్యం

భాగ్యనగరాన్ని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నగరంలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 410కు చేరడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లోని పలు ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత అధికంగా నమోదైంది. పీఎం 2.5 స్థాయులు 278 మైక్రోగ్రాములు, పీఎం 10 స్థాయులు 326 మైక్రోగ్రాములకు చేరాయి. వాహనాల పొగ, నిర్మాణ పనులు కాలుష్యానికి ప్రధాన కారణాలుగా గుర్తించారు. ఈ పరిస్థితి కొనసాగితే పిల్లలు, వృద్ధులతో పాటు శ్వాసకోశ సమస్యలున్నవారికి తీవ్ర ఆరోగ్య ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.