www.breakingnow.app | Fri, 20 Nov 2026
LATEST NEWS Andhra Pradesh, Tirupati

గంజాయి విక్రయదారుడు అరెస్టు

Share:
128 Views
గంజాయి విక్రయదారుడు అరెస్టు

తిరుపతి: జిల్లాలో గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎస్పీ ఎల్‌. సుబ్బరాయుడు ఆదేశాల మేరకుఅక్కుర్తి రైల్వే గేటు వద్ద రూరల్‌ సీఐ జి. ఇబ్రహీం సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముచ్చువోలు గ్రామానికి చెందిన బర్రి మోహన్‌రెడ్డి (మాధవరెడ్డి కుమారుడు)ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 1,100 గ్రాముల గంజాయితో పాటు సెల్‌ఫోన్‌, మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.