ఓయో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పెళ్లికాని జంటలకు రూమ్ లు అద్దెకు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఇక నుంచి యువతీ యువకులు తమ రిలేషన్‌షిప్‌కు సంబంధించి ఐడీ ప్రూఫ్స్ సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. సరైన ఐడీ ప్రూఫ్ లేకపోతే బుకింగ్స్ తిరస్కరించే అధికారం తమకు ఉంటుందని పేర్కొంది. మీరట్‌లోని ఓయో భాగస్వామి హోటల్స్‌లో చెక్ ఇన్ పాలసీ ప్రారంభించింది.