కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతామన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. గుంతలు లేని రోడ్లు చేసే బాధ్యత నాదన్నారు. కుప్పంలో జనాభా తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత విద్య కోసం బెంగళూరు వెళ్లడం కాదు.. కుప్పంకు రావాలన్నారు. అలాంటి విద్యా సంస్థలు ఇక్కడ పెడతామన్నారు. టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేస్తామన్నారు.