మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఔనన్నా కాదన్నా పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని, కాదనే దమ్ము ఎవరికీ లేదన్నారు. తను కొత్త తరాన్ని ప్రోత్సహించే వ్యక్తి అని, అవసరమైతే తన పదవిని వేరే వాళ్లకు ఇచ్చే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ దన్నారు. పవన్ విజయం సాధించేందుకు వర్మ పని చేశారని, ఆయనకు ఏ పదవి ఇవ్వాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు నాదెండ్ల మనోహర్.