తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ములుగు జిల్లాకు చేరుకున్నారు. గవర్నర్ రోడ్ మార్గంలో ములుగు జిల్లాకు గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. గవర్నర్ కు రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఎస్పీ డాక్టర్ పి.శబరిష్, ఐటిడిఏ పి.ఓ. చిత్రా మిశ్రా, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ తదితరులు పూల మొక్కలు అందజేసి సాదర స్వాగతం పలికారు.