మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో జగన్ రెడ్డిపై భగ్గుమన్నారు. తన ఇంటి దగ్గర చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై స్పందించారు. భద్రత లోపమనే ముందు బాధ్యతగా సహకరించడం కూడా అవసరమన్నారు. ఏ ప్రమాదం, నేరం జరిగినా పరిసర ప్రాంతాల ప్రజల ద్వారా సమాచారం, సీసీ టీవీ కెమెరా ఫుటేజ్ విచారణలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. నేరం జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల దృశ్యాలు రికార్డై ఉంటే వాటిని పోలీసులకు అందజేసి సహకరించడం కనీస బాధ్యత అని దానిని విస్మరించడం బాధాకరమన్నారు.